Monday, 30 June 2014

ఫొటోలపై ఆంక్షలు!




MaaStars





ఫొటోలపై ఆంక్షలు!



Deepika padukoneరణవీర్‌సింగ్‌తో తన ప్రేమ వ్యవహారాన్ని రహస్యంగా వుంచుతోంది బెంగళూరు భామ దీపికాపదుకునే. వీరిద్దరు ప్రేమలో వున్నట్లు గతకొంతకాలంగా మీడియాలో వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. అయితే తమ లవ్‌ఎఫైర్ గురించి ఈ జంట ఇంతవరకు బహిరంగంగా స్పందించలేదు. అనేక సందర్భాల్లో మీడియా వివరణ కోరినా సమాధానమివ్వలేదు. విఫలప్రేమ అనుభవాల దష్ట్యా తాజా ప్రేమాయణం గురించి దీపికాపదుకునే చాలా జాగ్రత్తలు తీసుకుంటోందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుతం జోయా అక్తర్ దర్శకత్వంలో దిల్ దడ్కనే ధో చిత్రంలో నటిస్తోంది దీపికాపదుకునే.


బార్సిలోనాలో ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది. దీపికాను కలవడానికి రణవీర్‌సింగ్ ఈ మధ్యనే బార్సిలోనా వెళ్లాడట. షూటింగ్ లొకేషన్‌లో ఈ ప్రేమజంట దర్శనమిచ్చే సరికి అక్కడ వున్న యూనిట్ సభ్యుల్లో కొందరు వారి ఫొటోలు తీసుకోవడం మొదలుపెట్టారట. అయితే తామిద్దరం కలిసి వున్న ఫొటోలు తీయడానికి వీళ్లేదని, దీనివల్ల మీడియాలో అనవసర ప్రచారం జరుగుతోందని యూనిట్‌సభ్యులపై మండిపడిందట దీపికా. ఆమె కోపాన్ని గ్రహించిన యూనిట్‌వారు తాము తీసిన ఫొటోల్ని దీపికా ముందే కెమెరాల్లోంచి తొలగించారట. ఈ సంఘటన బాలీవుడ్‌లో చర్చనీయాంశమవుతోంది.


The post ఫొటోలపై ఆంక్షలు! appeared first on MaaStars.