Sunday, 15 June 2014

అమ్మడికి కలిసొచ్చిన బాల రూల్స్




MaaStars





అమ్మడికి కలిసొచ్చిన బాల రూల్స్



vara lakshmi


తమిళనాట “బాల” అంటే ఒక బ్రాండ్ అంతే. విభిన్నమైన కథాంశాలంతో, విలక్షణమైన టేకింగ్తో తనదైన ముద్రని వేసుకున్న బాలా, పని విషయంలో చండ దర్శకుడు బాలా చిత్రాల్లో నటులెవరైనా సరే కథా పాత్రలే కనిపిస్తాయి. నటీనటుల పాత్రధారణల్లో ఆయన అంతగా శ్రద్ధ తీసుకుంటారు. పని విషయంలో దర్శకుడు బాల చండ శాసనుడు అని చెప్పుకోవచ్చు. ఆయన సినిమాలో పనిచేసే బాల కొన్ని షరతులు విధిస్తాడు. ఆయన ఇంతకుముందు తెరకెక్కించిన చిత్రాలను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. సేతు పితామగన్ చిత్రాల్లో విక్రమ్ పాత్రధారణ, నందాలో సూర్య, నాన్ కడవుల్‌లో ఆర్య, అవన్ ఇవన్ చిత్రంలో విశాల్, ఆర్యలను బాలా ఎలా మార్చారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటి బాలా ప్రస్తుతం తారై తప్పట్టై చిత్రాన్ని తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు. దర్శక, నిర్మాత, నటుడు శశికుమార్ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా వరలక్ష్మి ని ఎంపిక చేసుకున్నారు.


బాలా చిత్రాల్లో కథానాయకుడితో పాటు కథానాయిక పాత్రలకు ప్రాముఖ్యత ఉంటుందని చెప్పాల్సిన అవసరం లేదు. దర్శకుడు ఈ సారి కరగాటకార కళను చిత్ర ప్రధాన ఇతివృత్తంగా తీసుకున్నారు. నృత్యంలో ప్రవేశం ఉన్న నటి అవసరమవ్వడంతో ఆ అదృష్టం నటి వరలక్ష్మిశరత్‌కుమార్‌ని వరించింది. నటుడు విశాల్ సిఫార్సు, ఆమె పొట్ట అవకాశం రావడానికి పనిచేశాయంటున్నారు కోలీవుడ్ వర్గాలు. కరగాట కళాకారులకు కాస్త పొట్ట కనిపించాలట.


నటి వరలక్ష్మిని ఆడిషన్ చేసిన బాలా గత నెలలో శశికుమార్, వరలక్ష్మిలకు ఫొటో షూట్ నిర్వహించారట. అందులో నటి వరలక్ష్మి పొట్ట పరిధికి మించి ఉన్నట్లు అనిపించడంతో ఆమెకు కొన్ని షరత్తులు విధించారట. పొట్ట తగ్గించాలని సూచించారట. పార్టీలకు, పబ్‌లకు వెళ్లరాదని, వెళ్లినా అక్కడ గ్లాసు పట్టరాదంటూ హెచ్చరించారట. బాలా షరతుల కారణంగా వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రస్తుతం తన బరువును 12 కిలోలు తగ్గించారట.


పోనీలే పిల్లా….. ప్రత్యేకంగా వర్కవుట్లు చేసే బాధ తప్పుతుంది.


The post అమ్మడికి కలిసొచ్చిన బాల రూల్స్ appeared first on MaaStars.








No comments:

Post a Comment