MaaStars
మరో మల్టీస్టారర్ లో అమితాబ్
“ఉడాన్” లాంటి చక్కటి సినిమాని నిర్మించిన విక్రమాదిత్య నిర్మాణ సారధ్యంలో “ఘూమ్కేతు” అనే పెద్ద మల్టీస్టారర్ సినిమా రూపోంచించబడుతోంది. తాజా సమాచారం ప్రకారం, ఆ సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు అని సమాచారం. పూర్తిగా హాస్యప్రధానంగా రూపొందించబదనున్న ఈ సినిమాకి పుష్పేంద్ర మిశ్రా దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమా గురించి అమితాబ్ ‘ఈ సినిమాలో నా పాత్ర నూటికి నూరుపాళ్లు హాస్య ప్రధానమైంది. ఇందులో పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నా. ‘ఘూమ్‌కేతు’లో నా పాత్రకు సంబంధించి పలు అవతారాల్లో ప్రేక్షకులకు కనువిందు చేయనున్నాను’ అని తన బ్లాగ్‌లో వివరించాడు.
కామెడీ సినిమా, అందులోనూ చాలా కాలం తరువాత అమితాబ్ పోలీసు ఆఫీసర్ పాత్రలో కనిపించనుండటం అభిమానులకి ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తుంది అనడంలో సందేహం లేదు.
The post మరో మల్టీస్టారర్ లో అమితాబ్ appeared first on MaaStars.
No comments:
Post a Comment