MaaStars
విడుదలకి సిద్ధమవుతున్న “రన్ రాజా రన్”
విభిన్న పాత్రలు చేయడానికి ఆసక్తిని చూపే యువ హీరో శర్వానంద్, కొత్త అందాల ముద్దుగుమ్మ సీరత్ కపూర్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం “రన్ రాజా రన్”. ఈ చిత్రానికి సుజీత్ దర్శకుడు. గత ఏడాది సూపర్ హిట్ అయిన సినిమా ” మిర్చి” నిర్మాతలు ప్రమోద్, వంశీలు లావిష్ గా నిర్మించిన ఈ చిత్రం ఆగస్ట్ 1న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఘిబ్రాన్ అందించిన ఆడియో హిట్ కావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ‘రన్ రాజా రన్’లో శర్వానంద్(రాజా) మొబైల్స్ దొంగగా కనిపించనున్నారు.
శర్వానంద్ సరసన ప్రియా పాత్రలో సీరత్ కపూర్ నటించింది. శర్వానంద్ పరిచయం తర్వాత ప్రియా తన లైఫ్ స్టైల్ మార్చుకుంటుంది, మార్చుకునేలా చేస్తాడు శర్వా. జీవితంలో ప్రతి చిన్న మూమెంట్ ఎంజాయ్ చేయడం మొదలుపెడుతుంది. ఆ తర్వాత వాళ్ళ జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి అనే కథతో సినిమా రూపొందిందని సమాచారం.
The post విడుదలకి సిద్ధమవుతున్న “రన్ రాజా రన్” appeared first on MaaStars.
No comments:
Post a Comment