MaaStars
మరోసారి పోలీసులకి చిక్కిన రచయిత
ప్రముఖ సినిమా రచయిత బీవీఎస్ రవి మరోసారి మద్యం తాగుతూ వాహనం నడిపి పోలీసులకు దొరికిపోయాడు. ఎప్పటిలాగే శుక్రవారం రాత్రి హైదరాబాద్ పోలీసులు జూబ్లీ హిల్స్ ప్రాంతంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల కోసం తనిఖీలు నిర్వహించారు. బ్రీత్ ఎనలైజర్లతో అటు నుంచి వెళ్లే వాహన చోదకులు అందరినీ తనిఖీ చేస్తుండగా, అదే సమయానికి అక్కడికి చేరుకున్న సినీ రచయిత బీవీఎస్ రవి వాహనాన్ని పోలీసులు ఆపారు. రవి పక్కన ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ కూడా ఉన్నాడు.
వాహనం నడుపుతున్న బీవీఎస్ రవిని పోలీసులు బ్రీత్ ఎనలైజర్ తో పరీక్షించగా, మోతాదుకు మించి మద్యం సేవించినట్లు తేలింది. దాంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, ఇంతకుముందు కూడా ఒకసారి ఈయన మోతాదుకు మించి మద్యం సేవించి వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డారు. దాంతో ఇది రెండోసారి అయ్యింది. గతంలో ఆయన పట్టుబడినప్పుడు అదే కారులో సినీ నటుడు రవితేజ, కమెడియన్ శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నారు. వారిని కూడా పోలీసులు తనిఖీలు చేశారు. అయితే వీరు మద్యం సేవించలేదని తేలింది. అనంతరం మరోకారులో రవితేజ, శ్రీనివాసరెడ్డి అక్కడి నుంచి వెళ్లి పోయారు.
The post మరోసారి పోలీసులకి చిక్కిన రచయిత appeared first on MaaStars.
No comments:
Post a Comment