MaaStars
నేను మొక్కలతో మాట్లాడతాను
ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ దూసుకువెళ్తున్న అందాల ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా ఎనర్జెటిక్ హీరో రామ్ సరసన “పండగ చేస్కో” సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. “బలుపు” లాంటి సూపర్‌హిట్ సినిమా ఇచ్చి మాంఛి ఊపు మీదున్న గోపీచంద్ మలినేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, తమన్ సంగీత సారధ్యం వహిస్తున్నాడు.
‘పండగ చేస్కో’ సినిమాలో తన పాత్ర గురించి రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ..” మొక్కలు (ప్లాంట్స్)కు లైఫ్ ఉందని భావించే పాత్రలో నేను కనిపిస్తాను. వాటితో మాట్లాడే క్యారెక్టర్ నాది. అవి నేను చెప్పే మాటలు వింటున్నాయని ఫీల్ అయ్యే పాత్ర చేశాను. నేను ఇప్పటివరకు ఇలాంటి క్యారెక్టర్ లో నటించలేదు, ప్రేక్షకులు నా పాత్రను బాగా ఎంజాయ్ చేస్తారు” అని తెలిపింది.
సొనాల్ చౌహాన్ రెండవ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని పరుచూరి కిరీటి నిర్మిస్తున్నాడు.
The post నేను మొక్కలతో మాట్లాడతాను appeared first on MaaStars.
No comments:
Post a Comment