Tuesday, 15 July 2014

కన్నడంలో అదాశర్మ




MaaStars





కన్నడంలో అదాశర్మ



Adah Sharma  (7)హార్ట్ ఎటాక్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైంది అదా శర్మ. కథానాయికగా తొలిచిత్రంతోనే చక్కటి విజయాన్ని అందుకుంది ఈ సుందరి. ఈ సినిమాలో తన అందాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ఈ బాలీవుడ్ భామ తాజాగా కన్నడంలో అడుగుపెట్టబోతోంది. బాలీవుడ్‌లో సక్సెస్‌లను అందుకోవడంలో విఫలమైన ఆమె దక్షిణాదిన మాత్రం చక్కటి అవకాశాల్ని సొంతం చేసుకుంటోంది. వివరాల్లోకి వెళితే…పునీత్ రాజ్‌కుమార్ కథానాయకుడిగా కన్నడంలో తెరకెక్కుతున్న చిత్రం ధీర రాజావిక్రమ. అంజలి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో రెండోనాయికగా అదా శర్మ ఎంపికైంది. హార్ట్ ఎటాక్ చిత్రంలో ఆమె అభినయానికి ముగ్ధులైన దర్శకనిర్మాతలు అదాశర్మను తమ సినిమా కోసం ఎంపికచేసుకున్నట్లు తెలిసింది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఆమె పాత్ర పూర్తిగా విలక్షణ రీతిలో సాగుతుందని సమాచారం. అదా శర్మ మాట్లాడుతూ నిజజీవితంలో నేను చాలా అల్లరి అమ్మాయిని. ఇందుకు పూర్తి విరుద్ధంగా వుండే ఓ ఛాలెంజింగ్ తరహా పాత్రను ఈ సినిమాలో పోషించనున్నాను. ఇటువంటి చక్కటి పాత్రతో కన్నడ నాట అడుగుపెట్టడం ఆనందంగా వుంది అని తెలిసింది.


The post కన్నడంలో అదాశర్మ appeared first on MaaStars.








No comments:

Post a Comment