Thursday, 31 July 2014

హీరో గారి గూడు చెదిరింది




MaaStars





హీరో గారి గూడు చెదిరింది



Actor_Danushఒక పక్క ఆట్టహాసంగ జన్మదిన వేడుకలు, మరోపక్క స్వీయ నిర్మాణంలో హీరోగా చేసిన “వేలై ఇల్లా” చిత్రం ఘనవిజయం సాధించిన సదర్భంగా వేడుకలు జరుగుతున్నాయి. అంతలోనే తమిళ హీరో ధనుష్ కి విషాద వార్త. ఎంతో ఇష్టపడి అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ,ఎన్నో హంగులని కూర్చి కట్టించుకుంటున్న ఇల్లుని అధికారులు కూల్చేశారు. ధనుష్ కొవై జిల్లా వైదేహి నీర్ విళిచ్చి సమీపంలో అధునాతన వసతులతో ఒక భవనాన్ని నిర్మిస్తున్నాడు. అయితే ఆ భవనం అటవీ శాఖ పరిధిలో ఉండటం వల్ల వారి అనుమతి లేకుండా నిర్మించినట్లు ఫిర్యాదు రావటంతో కోవై జిల్లా అధికారులు భవనాన్ని కూల్చివేయాలని ఉత్తర్వులు జారీ చేశారు.


దీంతో ధనుష్ భవనం కూల్చివేతకు గురైంది. ఒక పక్క పుట్టినరోజు వేడుకలతో (మంగళవారం పుట్టినరోజు) మరోపక్క నిర్మించి, హీరోగా నటించిన చిత్రం వేలై ఇల్లా పట్టదారి విజయం సాధించిన ఆనందంలో ఉన్న ధనుష్ కు ఈ సంఘటన ఆవేదన కలిగించినట్లు సమాచారం. అయితే ఈ ఘటనపై అతను స్పందించలేదు.


The post హీరో గారి గూడు చెదిరింది appeared first on MaaStars.








No comments:

Post a Comment