Sunday, 20 July 2014

విజయ్‌తో జోడీగా…




MaaStars





విజయ్‌తో జోడీగా…



ఎన్ని సినిమాల్లో నటించినా కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమాకే ప్రత్యేక స్థానం వుంటుంది అని చెబుతోంది శృతిహాసన్. ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో బిజీగా వున్న ఈ సుందరి త్వరలో విజయ్ కథానాయకుడిగా శింబు దేవన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రానికి గ్రీన్‌సిగ్నలిచ్చింది. ఇది విజయ్ నటిస్తున్న 58వ సినిమా. ఈ సందర్భంగా శృతిహాసన్ మాట్లాడుతూ ఇటీవలే విజయ్ సార్ హీరోగా నటించనున్న చిత్రాన్ని అంగీకరించాను. శింబుదేవన్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమా సరికొత్త నేపథ్యంలో తెరకెక్కనుంది. ఈ చిత్రంలో హాలీవుడ్ సినిమాల తరహాలో వరల్డ్ క్లాస్ గ్రాఫిక్స్‌ని చూపించబోతున్నాం అని తెలిపింది.


బాలీవుడ్ చిత్రం గబ్బర్ గురించి వివరిస్తూ గబ్బర్ చిత్రంలో నా పాత్ర చాలా కొత్తగా వుంటుంది. ఇంత మంచి పాత్ర నాకు ఇచ్చినందుకు దర్శకుడు క్రిష్‌కు రుణపడివుంటాను అని చెప్పింది. మీరు నటించిన తెలుగు సినిమాల్లో మర్చిపోలేని సినిమా ఏదైనా వుందా? అని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ అలా చెప్పాలంటే చాలా వున్నాయి. అయితే నాకు కమర్షియల్ హీరోయిన్‌గా గుర్తింపునిచ్చి నా కెరీర్‌ను మలుపు తిప్పిన గబ్బర్‌సింగ్ సినిమా నా కెరీర్‌లో చాలా ప్రత్యేకమైనది. ఈ సినిమా నా కెరీర్‌నే మార్చేసింది. ప్రస్తుతం మూడు భాషల్లో బిజీగా మారానంటే ఈ సినిమా ఇచ్చిన ప్రోత్సాహమే కారణం అని తెలిపింది. శృతిహాసన్ తెలుగులో మహేష్‌బాబు నటిస్తున్న ఆగడు చిత్రంలో ఓ ఐటమ్ సాంగ్‌లో కనిపించబోతున్న విషయం తెలిసిందే.విజయ్‌తో జోడీగా…


The post విజయ్‌తో జోడీగా… appeared first on MaaStars.








No comments:

Post a Comment