MaaStars
వచ్చే ఏడాది రాజమౌళి-ఎన్టీఆర్ సినిమా?
కొన్ని పుకార్లు నిజమైతే బాగుండునణిపిస్తాయి. అలాంటి వాటిలో ఇదొకటి అని చెప్పవచ్చు. ప్రస్తుతం టాలీవుడ్ చక్కర్లు కొడుతున్న పుకారు ఏమనగా..వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో రాజమౌళి ఎన్టీఆర్ కి ఒక సినిమా చేసిపెట్టడానికి ఒప్పుకున్నట్టు ఫిల్మ్ నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ‘రభస’ ఘోర పరాజయం తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజమౌళిని వ్యక్తిగతంగా కలిసి తనకు ఒక సినిమా చేసి పెట్టమని కోరినట్లుగా టాక్. దీనికి రాజమౌళి ‘బాహుబలి’ విడుదల తరువాత జూనియర్ కోరిక తీరుస్తానని మాట ఇచ్చినట్లుగా వార్తల హడావిడి జరుగుతోంది.
జూనియర్ కు మొట్టమొదటి కెరియర్ బ్రేక్ ఇచ్చిన ‘‘స్టూడెంట్ నెం 1’ ఆ తరువాత ఎన్టీఆర్ ను యంగ్ టైగర్ గా మార్చిన ‘‘సింహాద్రి ‘, లతో పాటు వరస పరాజయాలతో ఉన్న జూనియర్ ను ‘యమదొంగ ‘ గా మార్చి మూడు సూపర్ హిట్లు ఇచ్చిన ఈ కాంబినేషన్ లో సినిమా ఉంటుంది అని ఎప్పటి నుంచో వార్తలు ఉన్నా రకరకాల కారణాలతో ఆ సినిమా సెట్స్ పైకి రాలేదు . అయితే ప్రస్తుతం జూనియర్ పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్న నేటి తరుణంలో నిజంగా జూనియర్ కోరికను రాజమౌళి మన్నిస్తే అది టాలీవుడ్ సంచలనమే అనుకోవాలి.
The post వచ్చే ఏడాది రాజమౌళి-ఎన్టీఆర్ సినిమా? appeared first on MaaStars.
No comments:
Post a Comment