MaaStars
ఆ సినిమాపై కేసు వేసిన సూపర్‌స్టార్?
ఎవరికి వారు ఇస్తాం వచ్చినట్టు కథలు వ్రాసుకోవడం… తోచినట్టు సినిమాలు తీయడం చేస్తున్నారు అని కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నట్టుగానే, ఈ ప్రస్తుత ఉదంతం అందుకు ఉదాహరణగా నిలుస్తుంది. ఒక హీరోని తమ బాగు కోసం ఉపయోగించుకుంటే వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే, గతంలోనూ – ప్రస్తుతం అలా పవన్ కల్యాణ్ పేరుని, రజనీకాంత్ పేరుని వాడుకుని ఎంతోమంది లబ్ది పొందారు. అందుకు సదరు హీరోల నుండి ఎప్పుడూ ఎటువంటి ఆబ్‌జెక్షన్ ఎదురుకాలేదు. కానీ, ఆ అభిమానం శ్రుతిమించి, ఏకంగా స్టార్ హీరోలకే ఇబ్బంది కలిగేలా ఉంటే వాళ్ళు కలుగజెసుకోకుండా ఉంటారా? అందుకే తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ రంగంలోకి దిగాల్సి వచ్చింది.
సూపర్ స్టార్ రజినీకాంత్ కేసు వేయడంతో ‘మై హు రజనీకాంత్’ అనే హిందీ సినిమా విడుదలపై స్టే చెన్నై హైకోర్ట్ స్టే విధించింది. నిర్మాతలను కోర్ట్ కు స్వయంగా హాజరయి సమాధానం ఇవ్వవలసిందిగా ఆదేశించింది.
అసలు వివరాలలోకి వెళ్తే ‘బిల్లా’, ‘సింహ’, ‘దూకుడు’, ‘మిర్చి’ తదితర తెలుగు సినిమాలలో నటించిన తమిళ నటుడు ఆదిత్య ప్రధాన పాత్రలో ‘మై హు రజనీకాంత్’ అనే హిందీ సినిమా రూపొందింది. ఈ సినిమాలో కాంట్రాక్ట్ కిల్లర్ కం సిబిఐ ఆఫీసర్ రజినీకాంత్ రావు పాత్రలో ఆదిత్య నటించాడు. త్వరలో విడుదలకు సిద్దమవుతుంది. ఈ సినిమా తన ఇమేజ్ డామేజ్ చేసే విధంగా ఉందని, అందువల్ల సినిమా విడుదలపై నిషేధం విధించాలని రజినీకాంత్ కోరారు. రజిని విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న చెన్నై హైకోర్ట్ మధ్యంతర ఉత్తర్వులు జారి చేసింది.
అదీ విషయం.
The post ఆ సినిమాపై కేసు వేసిన సూపర్‌స్టార్? appeared first on MaaStars.
No comments:
Post a Comment