MaaStars
మళ్లీ తెరమీద మెరవనున్న “డ్రీమ్ గర్ల్”
బాలీవుడ్ హీరో ధర్మేంద్ర ని పెళ్ళిచేసుకున్న తరువాత , అలనాటి అందాలనటి ‘ డ్రీమ్గర్ల్’ హేమమాలిని సినిమాల్లో పెద్దగా నటించింది లేదు. నటనకి కామా పెట్టిన చాలా ఏళ్ల తరువాత ఇప్పుడు, హేమామాలిని ఒక హింది సినిమాలో నటించడానికి ఒప్పుకుంది. ఆమె అభిమానులకి ఇది నిజంగానే శుభ వార్త అని చెప్పుకోవాలి.
గతంలో “అందాజ్”, “సీతా ఔర్ గీతా”, “షోలే” లాంటి సూపర్‌హిట్ చిత్రాల్లో నటించింది హేమామాలిని. మళ్లీ ఇన్నేళ్లకు రమేశ్ సిప్పి దర్శకత్వంలో నటించనుండటం పట్ల తన హర్షాన్ని వ్యక్తం చేస్తూ తన తాజా సినిమా వివరాలని ట్విట్టర్ లో పంచుకుంది హేమామాలిని. రమేష్ సిప్పీ రూపొందిస్తున్న ‘సిమ్లా మిర్చి’లో రాజ్‌కుమార్‌రావు సరసన హేమమాలిని నటిస్తోంది. ‘సిమ్లామిర్చి’ షూటింగ్ ఆదివారం మొదలైంది. మొదటి రోజు షూటింగ్ తర్వాత దర్శకుడు రమేష్ సిప్పీ కూడా ఇందులో అతిథిపాత్రలో కనిపించనున్నాడు.
The post మళ్లీ తెరమీద మెరవనున్న “డ్రీమ్ గర్ల్” appeared first on MaaStars.
No comments:
Post a Comment