Friday, 24 October 2014

“బాహుబలి” షూటింగ్ మళ్లీ మొదలైంది




MaaStars





“బాహుబలి” షూటింగ్ మళ్లీ మొదలైంది



bahubali-working-stills11373265275మళ్లీ మొదలవడం ఏమిటి….ఆల్రెడీ మొదలయి దాదాపు మూడేళ్లు కావస్తుంటే అనుకుంటున్నారా? మరేం లేదండీ….. మీరు అనుకున్నట్టుగానే “బాహుబలి” షూటింగ్ దాదాపు గత మూడెల్లనుంది నడుస్తోంది. ఎన్నో అవాంతరాలు వచ్చినా, ఎక్కడ విరామం లేకుండా సాగిపోతోంది. అందుకే దీపావళి సందర్భంగా ఆ చిత్ర యూనిట్ సభ్యులంతా “బాహుబలి” షూటింగ్ కి ఒక్కరోజు విరామం తీసుకున్నారు. మళ్లీ ఈరోజు నుండి షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీ లో మొదలైంది.


టాలీవుడ్ మోస్ట్ సక్సెఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ప్రస్తుతం దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘బాహుబలి’. గత రెండు సంవత్సరాలుగా ఈ సినిమా సెట్స్ పై ఉంది. ఈ చిత్ర టీం గత నాలుగైదు నెలల నుంచి ఏ మాత్రం విశ్రాంతి లేకుండా శరవేగంగా షూటింగ్ చేస్తున్నారు. ఎట్టకేలకు వెళ్ళు దీపావళి సందర్భంగా ఒక్క రోజు షూటింగ్ కి గ్యాప్ ఇచ్చారు. ప్రసతుతం ప్రభాస్ తదితరులపై కొన్ని సీన్స్ ని షూట్ చేస్తున్నారు.


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో రానా ప్రభాస్ బ్రోతె గా కనిపిస్తుంటే అనుష్క, తమన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. విజువల్ వండర్ గా ఉండేలా తీస్తున్న ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా పనిచేస్తున్నారు. ఈ సినిమాని రెండు పార్ట్స్ గా మన ముందుకు తీసుకురానున్నారు. అందులో ఒక పార్ట్ ని 2015 ఏప్రిల్ లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తుంటే, రెండవ పార్ట్ 2016 సంక్రాంతికి రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.


The post “బాహుబలి” షూటింగ్ మళ్లీ మొదలైంది appeared first on MaaStars.








No comments:

Post a Comment