Sunday, 26 October 2014

అతనితో మళ్లీ చేయాలని ఉంది




MaaStars





అతనితో మళ్లీ చేయాలని ఉంది



12-hari-vishalతమిళ హీరో విశాల్ నటించిన తాజా చిత్రం “పూజా” విడుదలయిన అన్ని సెంటర్లలోనూ బాగా ఆడుతోంది. మామూలుగా ఏ సినిమా అయినా ఏదో ఒక వర్గం ప్రేక్షకులకి నచ్చుతుంది కానీ, “పూజా” మాత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని మెప్పించి, విజయపథంలో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో విశాల్ మాట్లాడారు. ‘‘హరితో ఏడేళ్ల క్రితం ‘భరణి’ చేశాను. మళ్లీ ఇన్నాళ్లకు తనతో పనిచేసే అవకాశం చిక్కింది.


ఇద్దరం కలిసి సినిమా చేద్దామనుకున్నప్పుడే కుటుంబ ప్రేక్షకులకు కూడా నచ్చే కథ కావాలని తనతో చెప్పాను. అనుకున్నట్టే అందరికీ నచ్చే కథ తయారు చేశాడు. ఇప్పుడు అన్ని చోట్లా మంచి స్పందన వస్తోంది. నిర్మాణంలో ఉన్నప్పుడు ఏదైతే హైలైట్ అవుతాయని అనుకున్నానో అవన్నీ హైలైట్ అవ్వడం ఆనందంగా ఉంది. రాధిక, సత్యరాజు కాంబినేషన్ సన్నివేశాలు, సంభాషణలు బాగా పండాయి. హరితో తప్పకుండా మళ్లీ ఓ సినిమా చేస్తాను’’ అని చెప్పారు. విశాల్ మంచి నటుడే కాక మంచి నిర్మాత కూడా అనీ, యాక్షన్ సీన్స్ బాగా రక్తి కట్టించారనీ హరి ప్రశంసించారు.


The post అతనితో మళ్లీ చేయాలని ఉంది appeared first on MaaStars.








No comments:

Post a Comment