MaaStars
మోడీతో ‘సెల్ఫీ’లకై ఎగబడుతున్న తారలు
సినీ తారలు, క్రీడాకారులు సంపాదించుకున్న క్రేజ్ ముందు మిగతా సెలెబ్రిటీలు దిగదుడుపే అన్నట్టు ఉంది ప్రస్తుత పరిస్థితి. అందరూ సినిమా తారలతో ఫోటోలు దిగడానికి ఎగబడటం మనం ఎప్పుడూ చూసేదే, కానీ దేశ ప్రధానితో సినీతారలు ఫోటోలు దిగడానికి క్యూ కట్టడం అన్నది అరుదైన విషయమే. సినీ తారల్లో కూడా అంతటి ఉత్సాహాన్ని కలుగజేసింది ప్రధానమంత్రి మోడీ చరిస్మా. అందుకే, ఆయనతో ఫోటోలు దిగడానికి సినీతారలు తెగ ఉత్సాహం చూపిస్తున్నారు.
బాలీవుడ్ సెలబ్రిటీలు సోనమ్ కపూర్, శ్రద్ధా కపూర్ శనివారం ముంబైలో మోదీతో కలసి సెల్ఫీ తీసుకొని సంబరపడిపోయారు. సోనమ్ ఓ ఆస్పత్రి ప్రారంభోత్సవంలో సెల్ఫీ తీసుకొని ట్విట్టర్‌లో పోస్ట్‌చేశారు. శ్రద్ధా ‘ఆషిఖి 2’లో సహనటుడు ఆదిత్యారాయ్ కపూర్‌తో కలిసి మోదీతో సెల్ఫీ తీసుకున్నారు. ‘మన ప్రియమైన ప్రధానితో కలిసే అమూల్యమైన అవకాశం దక్కింది’ అని కాంక్షిస్తూ శ్రద్ధా ట్విట్టర్‌లో పోస్ట్‌చేశారు. గాయకుడు సోనూ నిగమ్ కూడా మోదీతో సెల్ఫీ తీసుకున్నాడు.
హృతిక్‌కు ప్రధాని మోదీ ప్రశంసలు:
‘స్వచ్ఛభారత్’కు చక్కని ప్రచారం అందిస్తూ అందులో భాగస్వాముడవుతున్నందుకు ‘బాలీవుడ్’ నటుడు హృతిక్ రోషన్‌పై మోదీ ప్రశంసల జల్లు కురిపించారు. హృతిక్ ముంబై జుహు వీధిలో చేపట్టిన పరిశుభ్రతా కార్యక్రమాన్ని ఫొటోలతో సహా ట్విట్టర్‌లో ఉంచడంతో దానిపై ప్రధాని ట్వీట్ చేశారు. హృతిక్ చూపిన చొరవ ఎంతో మందిని ప్రభావితం చేస్తుందని పేర్కొన్నారు.
The post మోడీతో ‘సెల్ఫీ’లకై ఎగబడుతున్న తారలు appeared first on MaaStars.
No comments:
Post a Comment