Friday, 11 July 2014

35కిలోల బరువు మోస్తూ…




MaaStars





35కిలోల బరువు మోస్తూ…



Anushka Sharma Photo Shoot (1)మనం ధరించే దుస్తులు రెండు కిలోల బరువు మించకుండానే వుంటాయి. అవి ఏ కొంచెం బరువుపెరిగినా అసౌకర్యంగా ఫీలవుతాము. అయితే బాలీవుడ్ కథానాయిక అనుష్కశర్మ బాంబే వెల్వెట్ సినిమా కోసం ఏకంగా 35కిలోల బరువుతూగే డిజైనర్ గౌను ధరించి అందరినీ ఆశ్చర్యపడేలా చేసింది. ఈ చిత్రంలోని కథానాయిక పరిచయ దశ్యం కోసం ప్రముఖ బాలీవుడ్ డిజైనర్ నిహారికఖాన్ ఈ వస్ర్తాన్ని తయారుచేసిందట. ఇందులో అనుష్కశర్మ జాజ్‌సింగర్ పాత్రను పోషిస్తోంది. ఆమె పాత్రకు అనుగుణంగా భారీతనం ఉట్టిపడేలా గౌనుకు రూపకల్పన చేశానని చెప్పింది డిజైనర్ నిహారికాఖాన్. దీని తయారీ కోసం సంవత్సరం పాటు శ్రమించానని చెప్పిందామె. బరువు ఎక్కువైనా పాత్రపరంగా ఫ్యాన్సీగౌను ధరించడం ఆనందంగా వుందని అనుష్కశర్మ తెలిపింది. ఆమె మాట్లాడుతూ సినిమాలోని పరిచయగీతం కోసం డిజైనర్ గౌను ధరించాల్సివచ్చింది. బరువు ఎక్కువైనందువల్ల నడక చాలా కష్టమనిపించింది. నా అదష్టం కొద్ది ఈ గౌనుతో డ్యాన్స్ చేయాలని చెప్పలేదు అని చమత్కరించింది అనుష్కశర్మ.


The post 35కిలోల బరువు మోస్తూ… appeared first on MaaStars.








No comments:

Post a Comment