MaaStars
నిషా ఎక్కిస్తుంది!
పూనమ్‌పాండే ప్రధాన పాత్రలో నటించిన బాలీవుడ్ చిత్రం నషా. హిందీలో విజయవంతమైన ఈ చిత్రాన్ని తేరా నషా పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు నిర్మాత ఇ.వి.ఎన్. చారి. అమిత్ సక్సేనా దర్శకుడు. సెన్సార్ కార్యక్రమాల్ని పూర్తిచేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ఇప్పటివరకూ ఎవరూ టచ్ చేయని కొత్త కథ, కథనాలతో తెరకెక్కిన చిత్రమిది. ఈ సినిమాలో పూనమ్‌పాండే పాత్ర చిత్రణ కొత్త పంథాలో సాగుతుంది. గ్లామర్‌తో పాటు ఆమె అభినయంతో ఆకట్టుకుంటుంది. సంగీత్-సిద్ధార్థ్ స్వరాలు ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. మంచి సినిమాగా సెన్సార్ వారి అభినందనలు పొందడం ఆనందంగా వుంది. హిందీలో మాదిరిగానే తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారమే నమ్మకముంది అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం : సంగీత్-సిద్ధార్థ్.
The post నిషా ఎక్కిస్తుంది! appeared first on MaaStars.
No comments:
Post a Comment