MaaStars
అభిమాని కోసం బాడీగార్డ్ ని కొట్టిన సల్మాన్
మన తెలుగులో అభిమానులని కొట్టిన హీరోలని,హీరోయిన్లని చూశాం కానీ, ఒక అభిమాని కోసం తన రక్షణ కోసమే నియమించుకున్న సొంత బాడీగార్డ్నే కొట్టిన హీరోని ఎప్పుడైనా చూశామా? చూడలేదు… చూసే అవకాశమూ లేదు. కానీ, బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ అలా కాదు. సల్లూ భాయ్ తన అభిమానులని ప్రాణప్రదంగా చూసుకుంటాడు. అడిగిన వారందరికీ, ఓపికగా ఆటోగ్రాఫ్ లు, ఫోటోగ్రాఫ్ లు ఇచ్చి ఆనందపరుస్తాడు. ఖాళీ సమయం ఉంటే, షూటింగ్ స్పాట్లో అభిమానులతో కలిసి కూర్చుని కబుర్లు చెబుతాడు. అలాంటి తన అభిమానుల పట్ల ఎవరైనా దురుసుగా ప్రవర్తిస్తే , ఆఖరుకి తన అంగరక్షకులైనా సరే, సల్మాన్ సహించడు. అలాంటి ఉదంతమే ఒకటి వెలుగులోకి వచ్చింది. అదేమిటో మీరే చదవండి.
సల్మాన్ తాజాగా ముంబైలోని మెహాబూబ్ స్టూడియోస్ లో ఒక సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. షూటింగ్ విరామ సమయంలో తనని కలవడానికి ఎంతో దూరం నుండి వచ్చిన అభిమానులతో కలిసి సల్మాన్ ఫోటోలు దిగుతున్నాడు. ఆ సమయంలో ఒక అభిమాని సల్మాన్ తో ఫొటో దిగే సమయంలో అతని నడుము చుట్టూ చెయ్యి వేసే ప్రయత్నం చేశాడు. అది చూసిన సల్మాన్ బాడీగార్డ్ ఒకతను వెంటనే, ఆ అభిమాని చెయ్యు పట్టి బలంగా లాగి, సల్మాన్ నుండి దూరంగా జరిపే ప్రయత్నంలో ,ఆ బాడీగార్డ్ చేయి సల్మాన్ అభిమాని చేతికి బలంగా తాకింది. అది చూసి ఆగ్రహించిన సల్మాన్ వెంటనే , అభిమానులందరి సమక్షంలో బాడీగార్డ్ చెంప చెళ్ళుమనిపించాడు. ఇంకోసారి ఎవరూ తన అభిమానులతో అంత దురుసుగా ప్రవర్తించవద్దు అంటూ అక్కడ ఉన్న మిగతా బాడీగార్డ్లు, మరియు తన వ్యక్తిగత సహాయ సిబ్బందికి సల్మాన్ గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చాడట.
అలాంటి స్టార్లు కూడా ఉంటారా ఈరోజుల్లో అనిపిస్తోంది కదా…. ఉంటారుంటారు….ఒక రజీనీకాంత్ లా, ఒక పవన్కళ్యాణ్ లా, ఒక సల్మాన్ లా ..!!అభిమానులకోసం ప్రాణం పెట్టే స్టార్లు ఉంటారు.
The post అభిమాని కోసం బాడీగార్డ్ ని కొట్టిన సల్మాన్ appeared first on MaaStars.
No comments:
Post a Comment