Tuesday, 8 July 2014

చిరునవ్వే ఆయుధం




MaaStars





చిరునవ్వే ఆయుధం



Gopichand Bhavya Creations movie Stills (9)కండబలం కన్నా బుద్ధిబలాన్ని నమ్మే యువకుడతను. లౌక్యం, చాకచక్యంతో ఎలాంటి వ్యవహారాన్నైనా చక్కబెట్టడం అతని ైస్టెల్. అసాధ్యమనుకున్న లక్ష్యాల్ని కూడా చిరునవ్వుతో సుసాధ్యం చేస్తుంటాడు. స్మైలే అతని ైస్టెల్. అలాంటి యువకుడు ఓ సవాల్‌ను ఎదుర్కోవాల్సివస్తుంది. దానిని అధిగమించే క్రమంలో అతను చేసిన పోరాటమేమిటన్నదే మా చిత్ర ఇతివత్తం అన్నారు శ్రీవాస్.


ఆయన దర్శకత్వంలో గోపీచంద్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. భవ్యక్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద్‌ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రకుల్‌ప్రీత్‌సింగ్ కథానాయిక. నిర్మాత చిత్ర విశేషాలు తెలియజేస్తూ ఈ నెల 11తో టాకీపార్ట్ పూర్తవుతుంది. ఇదే నెల 25నుంచి 30 వరకు ైక్లెమాక్స్ ఘట్టాల్ని చిత్రీకరిస్తాం. ఆగస్టులో మూడు పాటల్ని విదేశాల్లో, రెండుపాటల్ని హైదరాబాద్‌లో చిత్రీకరిస్తాం. ఇందులో బ్రహ్మానందం పాత్ర హైలైట్‌గా వుంటుంది. హంసానందిని ప్రత్యేకమైన పాత్రను చేశారు. ఆమెపై ఓ పాట కూడా వుంటుంది. అనూప్‌రూబెన్స్ ఐదుపాటలకు చక్కటి స్వరాలిచ్చారు అన్నారు. చంద్రమోహన్, పోసాని కష్ణమురళి, కోవై సరళ, రఘుబాబు, ప్రభాకర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ, మాటలు: శ్రీధర్‌సీపాన, స్క్రీన్‌ప్లే: కోన వెంకట్-గోపీమోహన్, కెమెరా: వెట్రి.


The post చిరునవ్వే ఆయుధం appeared first on MaaStars.








No comments:

Post a Comment